మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 12:53:38

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు వీటికే..

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు వీటికే..

హైదరాబాద్ : కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31 వరకు రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌చేస్తూ సాంక్రామిక వ్యాధి నిరోధ చట్టం (1897), విపత్తు నిర్వహణ చట్టం కింద ఆదివారం జీవో నం.45 జారీచేసింది. మరి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్న వాటిని ఓసారి పరిశీలిద్దాం.. 

  • అందుబాటులో కూరగాయలు, పాలు, కిరాణా షాపులు. 
  • నీరు, విద్యుత్‌ సరఫరా, ఫైర్‌ సర్వీసు, గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులు పనిచేస్తాయి.
  • సరుకుల వాహనాలకు అనుమతి.
  • ఫార్మాస్యూటికల్స్‌, పప్పు, రైస్‌ మిల్లులు, ఆహార సంబంధిత పరిశ్రమలు, డెయిరీ యూనిట్లు యథావిధిగా పనిచేయవచ్చు. 
  • బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ కంపెనీలు, టెలికాం, పోస్టల్‌, ఇంటర్నెట్‌ సేవలు పని చేస్తాయి.
  • వైద్య పరికరాల ఆన్‌లైన్‌ డెలివరీ సేవలు.
  • ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల కోసం అమ్మఒడి వాహనాలు సిద్ధం.


logo