శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 00:31:43

ఆకట్టుకునేలా పర్యాటకం.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఆకట్టుకునేలా పర్యాటకం.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ధిచేయాలని పర్యాటక శా ఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లోనిర్మిస్తున్న మినీశిల్పారా మం, మినీట్యాంక్‌ బండ్‌ అభివృద్ధిపై గురువారం హైదరాబాద్‌లో ని తన నివాసంలో పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులతో మంత్రి సమీక్షించారు. పాలమూరులో పిల్లల కోసం ఆధునిక టాయ్‌ ట్రైన్‌ ఏర్పాటుపై చర్చించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర పర్యాటక ప్రాంతాలు, అంతర్జాతీయ విమనాశ్రయం సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక కేంద్రాల్లో అంతర్జాతీయస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర పర్యాటక సంస్థ ఎండీ మనోహర్‌, టూరిజం ఈడీ శంకర్‌రెడ్డి, కన్సల్టెంట్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


logo