గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 03:42:27

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • టీఆర్‌ఎస్‌ ఏజెంట్లతో విప్‌ బాల్క సుమన్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల తర్వాత జీహెచ్‌ఎంసీకి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కౌంటింగ్‌కు వెళ్లే టీఆర్‌ఎస్‌ ఏజెంట్లకు గురువారం తెలంగాణభవన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్‌ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురటం ఖాయమని తేలిందని చెప్పారు. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌కు పోలైన ప్రతి ఓటును పార్టీ ఖాతాలో వేసుకొనేందుకు ఏజెంట్లు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి బ్యాలెట్‌ పత్రాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, మాగం టి గోపీనాథ్‌, ఆయా డివిజన్ల కౌంటింగ్‌ ఏజెంట్లు పాల్గొన్నారు. logo