e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News ముంపు బాధితులను అప్రమత్తం చేయాలి

ముంపు బాధితులను అప్రమత్తం చేయాలి

ములుగు : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని మంగపేట పుష్కర ఘాట్, రామన్నగూడెం పుష్కర ఘాట్లను మంత్రి సందర్శించారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు గ్రామాలను ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్యను మంత్రి ఆదేశించారు.

ప్రజలు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

బొగత జలపాతం సందర్శన బంద్‌

మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు

ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం

ఏసీబీ వలలో మిర్యాలగూడ ఏవో

వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana