మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 19:54:44

సీఎం దీపావళి కానుకపై టీఎన్జీవోల హర్షం

సీఎం దీపావళి కానుకపై టీఎన్జీవోల హర్షం

హైదరాబాద్‌ : దీపావళి సందర్భంగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచి, సీఎం కేసీఆర్‌ కార్మికుల పట్ల మరోసారి ఉదారతను చాటుకున్నారని టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ అన్నారు. కార్మికుల జీతాల పెంపు, ఆర్టీసీ కార్మికుల వేతన బకాయిల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ మూడుసార్లు కార్మికుల వేతనాలు పెంచారన్నారు. గత నెలలో ధరణి వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించి.. అందరి మన్ననలు పొందారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే సారి అందేలా చర్యలు చేపట్టారని, అలాగే వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభిస్తూ.. రిజిస్ట్రేషన్ శాఖ బలోపేతానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. అలాగే కరోన సమయంలో ఆర్టీసీలో ఉద్యోగులకు బకాయిపడ్డ రెండు నెలల వేతనాలు (50శాతం) విడుదల చేసేందుకు ఆదేశాలివ్వడంపై సంతోషం వెలిబుచ్చారు. కార్మికుల తరఫున  సీఎం కేసీఆర్‌కు రాజేందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్‌ ధన్యవాదాలు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.