ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 18:26:56

టీఎన్జీవో నూత‌న అధ్య‌క్షుడికి కేటీఆర్ అభినంద‌న‌లు

టీఎన్జీవో నూత‌న అధ్య‌క్షుడికి కేటీఆర్ అభినంద‌న‌లు

హైద‌రాబాద్ : టీఎన్జీవో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్ గురువారం రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ‌ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాజేంద‌ర్‌ను కేటీఆర్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, టీఎన్జీవో మాజీ అధ్య‌క్షులు కారం ర‌వీంద‌ర్ రెడ్డి, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల కేంద్ర సంఘం  అధ్య‌క్షురాలు మ‌మ‌త పాల్గొన్నారు.  మామిళ్ల రాజేందర్‌ ప్రస్తుతం ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్నారు. 


logo