అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ మూడు ఉద్యోగ సంఘాల ఆఫీసు బేరర్లతో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ – గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ లతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం అయింది. పిఆర్సి సిఫార్సులు, ఇతర సమస్యలకు సంబంధించి మూడు ఉద్యోగుల సంఘాలు వారి అభిప్రాయాలను, ప్రతిపాదనలు త్రిసభ్య కమిటీ అసోసియేషన్ వారీగా విన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, వివిధ ఉద్యోగుల సంఘాల ఆఫీస్ బేరర్లు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.మమత, జనరల్ సెక్రెటరీ ఎ.సత్యనారాయణ, యం.బి.క్రిష్ణ యాదవ్, టీఎన్జీవో ప్రెసిడెంట్ యం.రాజేందర్ , వైస్ ప్రెసిడెంట్ రేచల్, సిటీ ప్రెసిడెంట్ ముజిబ్ , జనరల్ సెక్రెటరీ యం.ప్రతాప్, సెక్రటేరియట్ ఆఫీసర్స్, ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.నరెందర్ రావు, జనరల్ సెక్రెటరీ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’
- బీజింగ్‌కు చెక్ : డ్రాగన్ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆచితూచి నిర్ణయం!
- బ్రెజిల్లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్కరోజే 1,641 మంది మృతి
- ‘సీటీమార్’ టైటిల్ ట్రాక్‌కు ఈల వేయాల్సిందే
- కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- మదర్సాలలో భగవద్గీత, రామాయణం