శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 02, 2020 , 20:15:27

కూరగాయలు, పండ్ల సరఫరాపై ప్రత్యేక నజర్‌

కూరగాయలు, పండ్ల సరఫరాపై ప్రత్యేక నజర్‌

హైదరాబాద్:  లాక్‌డౌన్‌ నేపథ్యంలో కూరగాయలు, పండ్ల సరఫరాపై వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి.  దీనిపై ప్రత్యేక విధానాన్ని అవలంభిస్తోంది.  వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, ఎస్టేట్‌ ఆఫీసర్లు, వాహన డ్రైవర్లు, హమాలీల సహాయంతో టీమ్‌ వర్క్‌తో రైతు బజార్లు, మార్కెట్‌లు,  క్లస్టర్ల మధ్య రవాణా వ్యవస్థను రూపొందించింది.  రాష్ట్రంలో విపత్తును ఎదుర్కొనేందుకు 18 క్లస్టర్లు, 15 మార్కెట్‌ యార్డులు, 43 రైతు బజార్ల నుంచి 29వేల క్వింటాళ్ల కూరగాయలను పంపిణీ చేస్తోంది.  ఒక్క జీహెచ్‌ఎంసీ  పరిధిలో బోయిన్‌పల్లి, గుడి మల్కాపూర్‌ మార్కెట్‌ల నుంచి 12 రైతు బజార్ల పరిధిలో 20లక్షల కుటుంబాలకు కూరగాయల సరఫరా చేస్తోంది. రైతుబజార్లలో సోషల్‌ డిస్టెన్సింగ్‌ సమస్య ఏర్పడకుండా మొబైల్‌ రైతు బజార్ల ద్వారా కూరగాయలను అందిస్తోంది. 200 వాహనాల్లో మొబైల్‌ రైతుబజార్‌ల ద్వారా 500 ప్రాంతాల్లో  3500ప్రాంతాల్లో ప్రతి వారం అందుబాటులోకి తీసుకువచ్చింది.  జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్‌లలో 625 చరదపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పండ్లు, కూరగాయల విక్రయాలు చేస్తోంది. 

అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వాహనాలను కూడా కూరగాయల రవాణాలో భాగస్వామ్యం చేస్తోంది.  లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి మార్చి నెలలోనే 700680క్వింటాళ్ల కూరగాయలు మార్కెట్‌ల ద్వారా విక్రయించారు.  హైదరాబాద్‌లో రైతు బజార్‌లలో రోజుకు యావరేజీగా 7500క్వింటాళ్ల కూరగాయలును అందుబాటులోకి తెచ్చింది.  నిత్యవసరాల్లో కీలకమైన పండ్లు, కూరగాయల లోటు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి వెల్లడించారు.


logo