e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News మైనార్టీ జూనియ‌ర్ కాలేజీల్లో 840 జేఎల్ పోస్టుల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ జూనియ‌ర్ కాలేజీల్లో 840 జేఎల్ పోస్టుల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

హైద‌రాబాద్ : తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ (TMR) జూనియర్ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రకటన వెలువ‌డింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) 2021-22 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న‌ 111 తెలంగాణ మైనారీటీస్‌ సొసైటీ(TMR) జూనియ‌ర్ కాలేజీల్లో ఈ నియామ‌కాలు జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా 12 టీఎంఆర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 85 వొకేషనల్ జూనియర్ లెక్చరర్లకు రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ సంస్థలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నుండి జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. రిక్రూట్‌మెంట్ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. నియామకాల కోసం సొసైటీ మార్గదర్శకాలను జారీ చేసింది.

నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జ‌ర‌గ‌నున్నాయి. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ లేదా సాధారణ జూనియర్ లెక్చరర్ల బదిలీ ద్వారా నియామకాలు జరిగినప్పుడు వీరి సేవలు రద్దు చేయబడతాయి. దరఖాస్తుదారు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MA/MSc/MCom) హోల్డర్ లేదా సంబంధిత సబ్జెక్టులో యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి 50 శాతం కంటే తక్కువ మార్కులు కలిగి ఉండ‌రాదు.

- Advertisement -

జూనియర్ లెక్చరర్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ మెథడాలజీతో NCTE ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి BEd లేదా తత్సమాన డిగ్రీ అవసరం. ఏదైనా గుర్తింపు పొందిన మాధ్యమిక పాఠశాల/జూనియర్ కళాశాలలో XI నుండి XII లేదా ఇంటర్మీడియట్ తరగతులను నిర్వహించడంలో మూడు సంవత్సరాల కన్నా తక్కువ కాకుండా అనుభవం అవసరం. అదేవిధంగా ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకేషనల్ నిర్వహణలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన ఒకేషనల్ జూనియర్ కళాశాలలో XI నుండి XII వరకు తరగతులు నిర్వ‌హించిన అనుభ‌వం క‌లిగిఉండాలి.

జూనియర్ లెక్చరర్ పోస్టుకు ఎంపిక ఆగస్టు 16 న జ‌ర‌గ‌నుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వ‌హ‌ణ‌. అదే సమయంలో ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ కోసం రాత పరీక్ష ఆగస్టు 6 న జరుగ‌నుంది. రెండు పోస్టులకు జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, పెడ‌గాజీ, సంబంధిత స‌బ్జెక్ట్‌లో అభ్య‌ర్థుల‌ను ప‌రీక్షిస్తారు. రాత ప‌రీక్ష 100 మార్కుల‌కు, ఇంట‌ర్వ్యూ 50 మార్కుల‌కు ఉంటుంది. ఆసక్తి గ‌ల‌ అభ్యర్థులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి సమర్పించవచ్చు. దరఖాస్తులను ఆగస్టు 2 లోపు సమర్పించాలి. కాగా జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం చివరి తేదీని పొడిగించే అవ‌కాశం ఉంద‌ని ఓ అధికారి చెప్పారు.

స‌బ్జెక్ట్‌ల వారీగా జూనియర్ లెక్చరర్ల ఖాళీలు :

 • ఇంగ్లీష్: 111
 • ఉర్దూ: 111
 • తెలుగు: 111
 • గణితం: 80
 • భౌతికశాస్త్రం: 63
 • కెమిస్ట్రీ: 63
 • వృక్షశాస్త్రం: 63
 • జంతుశాస్త్రం: 63
 • చరిత్ర: 31
 • అర్థశాస్త్రం: 48
 • పౌరశాస్త్రం: 48
 • వాణిజ్యం: 48

ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ల ఖాళీలు : 85

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana