శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 15:46:47

టిస్.. బీఏ సోషల్ సైన్సెస్‌ 2020-23 మెరిట్ జాబితా విడుదల

టిస్.. బీఏ సోషల్ సైన్సెస్‌ 2020-23 మెరిట్ జాబితా విడుదల

హైద‌రాబాద్ : టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్‌(టిస్‌) బీఏ సోష‌ల్ సైన్సెస్ 2020-23 మెరిట్ జాబితాను విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్  ba-admissions.tiss.edu కు లాగినై త‌మ ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. బీఏ ఇన్ సోషల్ వర్క్ ప్రోగ్రాం కోసం టిస్ ఆన్‌లైన్ వ్యక్తిగత ఇంటర్వ్యూ ప్రక్రియను కూడా ప్రారంభించింది. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులౌతారు. టిస్ గౌహతి క్యాంపస్ మూడేళ్ల ప్రొగ్రాం బీఏ ఇన్ సోషల్ సైన్సెస్‌ను అందిస్తుంది. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఏదైనా సబ్జెక్ట్ స్ట్రీమ్‌లో 12 వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందుకు అర్హులు. బోధనా మాధ్యమం ఇంగ్లీష్.


logo