బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 19:30:21

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు  రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.  ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల నుండి విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు. మూడవరోజు శ్రీభూదేవీ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహించాడు. కార్యక్రమంలో టీటీడీ  పెద్దజీయర్ స్వామి,  చిన్నజీయ‌ర్ స్వామి, టీటీడీ అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


logo
>>>>>>