గురువారం 28 మే 2020
Telangana - May 18, 2020 , 00:25:42

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కరోనా వైరస్‌వ్యాప్తి నియంత్రణకు క్యూ లైన్లలో భక్తుల మధ్య భౌతికదూరం ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికోసం ఎరుపురంగు గుర్తులను వేశారు. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా మాస్క్‌ ధరించాలని టీటీడీ సూచించింది. ప్రతిరోజూ 10 వేల మందికి మించకుండా దర్శనానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వ ఆమోదం కోసం చూస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. logo