శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 13:47:45

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమల:  కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ శార్వరి నామ  ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి.  బంగారు వాకిలి చెంత ఉగాది ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవర్లను సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేశారు.   శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి  ఉగాది ఆస్థానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి పాదాల చెంత ఉంచిన శార్వారి నామ సంవత్సర పంచాంగం తీసుకుని టీటీడీ ఆస్థాన సిద్దాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది ఆస్థానంలో అర్చకులు,  సిబ్బంది పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన ఫల-పుష్ప-కూరగాయల అలంకరణలు భక్తులను కనువిందు చేశాయి. 


logo