గురువారం 28 మే 2020
Telangana - May 21, 2020 , 09:44:19

రూ.25కే తిరుపతి లడ్డూ

రూ.25కే తిరుపతి లడ్డూ

  • టీటీడీ కల్యాణ మండపాల ద్వారా విక్రయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి చిన్న లడ్డూల ధరను రూ.50 నుంచి రూ.25 కు తగ్గించినట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రతిరోజు 3 లక్షల నుంచి 4లక్షల లడ్డూలను తయారుచేస్తున్నామని, ఎల్లుండి నుంచి భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమయ్యే వరకు టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కువసంఖ్యలో లడ్డూలు కావాలనుకునే భక్తులు తిరుమల ఆలయ డిప్యూటీ ఈవోను 9849575952 లేదా 9701092777 ఫోన్‌నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. శ్రీవారి ఈ-హుండీ ద్వారా ఇప్పటివరకు రూ.1.97 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. 


logo