శనివారం 11 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 18:02:45

8 నుంచి స్వామి వారి దర్శనం

8 నుంచి స్వామి వారి దర్శనం

తిరుమల: రెండు నెలలుగా మూతపడ్డ ఆలయాల్లో పున:దర్శనం  కోసం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. లాక్ సడలింపులతో ప్రముఖ ఆలయాలన్నీ తెరుచుకోనున్నాయి. దీనిలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల,తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనం కోసం టీటీడీ బోర్డు పలు చర్యలు తీసుకొంటుంది. ఈనెల 8నుంచి టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, పాలకమండలి సభ్యులు మూడు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం పలు జాగ్రత్తలు చేపట్టి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. క్యూలైన్ భక్తుల మధ్య భౌతికదూరం ఎలా కల్పించాలి తదితర వాటిపై నిర్ణయాలు తీసుకొంటామని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. కోనేటీ స్నానానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.ఆన్ బుకింగ్ సర్వదర్శనం లేదా టికెట్ దర్శనానికి అనుమతి, ఆన్ బుకింగ్ అవగాహన కోసం అలిపిరి గేట్ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే భక్తులను పరీక్షించి దర్శనానికి అనుమతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


logo