ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 18:39:53

తిరుమల శ్రీవారి అర్జితసేవ టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి అర్జితసేవ టికెట్లు విడుదల

తిరుమల: జూన్‌ నెలకు సంబంధించి శ్రీవారి అర్జితసేవ ఆన్‌లైన్‌ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జూన్‌ నెల కోటాకు మొత్తం 60,666 శ్రీవారి అర్జితసేవ టికెట్లు విడుదలయ్యాయి. ఇందులో సుప్రభాతం 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాదదర్శనం 1,725, ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో50,700 , విశేషపూజ 1500, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, అర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం6,600, సహస్రదీపాలంకార సేవ 17,400 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,966 టికెట్లు విడుదల చేశారు.


logo