Telangana
- Jan 04, 2021 , 02:16:51
తిరుమల సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల జారీ

హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, టీటీడీ విష్ణునివాసం కాంప్లెక్స్‌లలో టోకెన్లను శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులకు అందజేస్తున్నది. సర్వదర్శన టోకెన్లను ముందు రోజు అందుబాటులో ఉంచుతున్నది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ డిసెంబర్ 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నది. ఈ కార్యక్రమం సోమవారంతో ముగియనున్నది. గతంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన టీటీడీ.. ఈ సారి పది రోజులపాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజావార్తలు
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు కీలకం
- జంగుబాయి క్షేత్రం జనసంద్రం
- మాజీ సర్పంచ్ మృతికి పలువురి సంతాపం
- మిర్యాలగూడ శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి
- ఏడు పదులకుఎన్నో ఫలాలు
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- ఉపాధి కల్పనకు ప్రభుత్వం చర్యలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్‌లను ఆశ్రయించాలి
MOST READ
TRENDING