బుధవారం 27 మే 2020
Telangana - May 07, 2020 , 01:42:11

సకాలంలో ఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌

సకాలంలో ఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

ఖిల్లాఘణపురం: ఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను సకాలంలో పూర్తిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం మామిడిమాడ, పర్వతాపూర్‌, అల్లమాయపల్లి, అప్పారెడ్డిపల్లి, షాపూర్‌, ఘణపురం, మనాజిపేట గ్రామాల్లో ఘనపురం బ్రాంచ్‌ కెనాల్‌  పనులను మంత్రి పరిశీలించారు. కాలువ పనులు పూర్తిచేసి వానకాలం నాటికి ప్రతి చెరువును నింపాలని సూచించారు.  నాగర్‌కర్నూలు జిల్లా మంగనూరు నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అడ్డాకుల వరకు ఉన్న కెనాల్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. జిల్లాకేంద్రంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమానికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు.logo