బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 19:55:37

ఇప్పటివరకు రూ. 4,006 కోట్లు రైతుల ఖాతాలో జమ : మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

ఇప్పటివరకు రూ. 4,006 కోట్లు రైతుల ఖాతాలో జమ : మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 4 వేల 6 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమచేసినట్లు రాష్ట్ర సివిల్‌ సైప్లె కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, పేదలకు బియ్యం పంపిణీపై ఆయన మాట్లాడుతూ... గడిచిన మంగళవారం ఒక్కరోజే రూ.290 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్లు చెప్పారు. కొన్ని జిల్లాలో అకాల వర్షం కురిసింది. రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే సాధ్యమైనంతగా ధాన్యాన్ని తరలించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 83 శాతం మంది లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. మొత్తం 87.55 లక్షల లబ్దిదారుల్లో నేటికి 72.73 లక్షల మంది లబ్దిదారులకు 2 లక్షల 72 వేల మెట్రిక్‌ టన్నుల ఉచిత బియ్యాన్ని, 2,488 మెట్రిక్‌ టన్నుల కందిపప్పును సరఫరా చేసినట్లు శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.


logo