మంగళవారం 26 మే 2020
Telangana - May 22, 2020 , 00:18:31

వృద్ధుడి ఆచూకీ చెప్పిన టిక్‌టాక్‌

వృద్ధుడి ఆచూకీ చెప్పిన టిక్‌టాక్‌

బూర్గంపహాడ్‌: రెండేండ్ల క్రితం పనికోసం వెళ్లి అదృశ్యమైన ఓ వ్యక్తి ఆచూకీ టిక్‌టాక్‌ వీడియోతోదొరికింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ మండలం పినపాక పట్టీనగర్‌కు చెందిన రొడ్డాం వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు రెండేండ్ల క్రితం పాల్వంచలో కూలి పనులకని ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బూర్గంపహాడ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. గ్రామానికి చెందిన నాగేందర్‌ అనే యువకుడు గురువారం ఓ టిక్‌టాక్‌ వీడియోలో వెంకటేశ్వర్లును గుర్తించి అతని కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో వారు బూర్గంపహాడ్‌ ఎస్సై బాలకృష్ణను సంప్రదించగా.. టిక్‌టాక్‌ వీడియో ద్వారా వెంకటేశ్వర్లు పంజాబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. 


logo