బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 14:46:23

దుబ్బాక‌లో హోరా హోరీ

దుబ్బాక‌లో హోరా హోరీ

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉత్కంఠ‌ను రేపుతున్నది. టీఆర్ఎస్ - బీజేపీల మ‌ధ్య హోరాహోరీ పోరు కొన‌సాగుతోంది. బీజేపీ స్వ‌ల్ప ఆధిక్యంలో ఉంది. 18వ రౌండ్ ముగిసేస‌రికి బీజేపీ 174 ఓట్ల స్వ‌ల్ప ఆధిక్యంలో ఉంది. 19వ రౌండ్‌లో టీఆర్ఎస్ 425 ఓట్ల ఆధిక్యం సాధించింది. ‌టీఆర్ఎస్ పార్టీ 6, 7, 13, 14, 15,16, 17, 18, 19 రౌండ్ల‌లో భారీ మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్లింది. ఈ రౌండ్ల‌లో టీఆర్ఎస్ పార్టీ సుమారు 4 వేల మెజార్టీని సాధించి విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తోంది. 18 రౌండ్లు ముగిసేస‌రికి బీజేపీకి 50467, టీఆర్ఎస్ 50293, కాంగ్రెస్ పార్టీకి 17,389 ఓట్లు పోల‌య్యాయి.