ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Nov 30, 2020 , 17:41:57

కీర్యతండా శివారులో పులి సంచారం

కీర్యతండా శివారులో పులి సంచారం

వరంగల్‌ రూరల్ : జిల్లాలోని ఖానాపురం మండలం మారుమూల అటవీ ప్రాంతమైన కీర్యతండా శివారు గుట్టల్లో పెద్దపులి సంచరించినట్లు తెలిసింది. నర్సంపేట ఎఫ్‌ఆర్వో రమేశ్‌ కథనం ప్రకారం.. తండాకు చెందిన మహిళ దస్లీ ఆదివారం వ్యవసాయ పనుల కోసం శివారు గుట్టల్లోని పొలం వద్దకు వెళ్లగా కొద్ది దూరం నుంచి పెద్దపులి వెళ్తుండడం గమనించింది. భయంతో ఇంటికి వచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించింది. ఈ మేరకు సోమవారం కీర్యతండా శివారులోని గుట్టలు, పొలాల్లోకి వెళ్లి పరిశీలించగా పెద్దపులి ఆనవాళ్లు కనిపించాయి. ఇక్కడ పెద్దపులి తిరుగుతున్నట్లు సమాచారం ఉంది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు తెలుపాలని ఎఫ్‌ఆర్వో కోరారు.

VIDEOS

logo