శనివారం 16 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 21:17:04

కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి సంచారం..

కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి సంచారం..

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్పేట్ మండలం ఆగర్‌గూడ సమీపంలోని పెద్దవాగు రేగిచెట్టు మడుగు వద్ద పెద్దపులి నీళ్లు తాగుతుండగా గురువారం గ్రామస్తులు గుర్తించి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. పులి నీళ్లుతాగి అగర్‌గూడ వైపు అడవిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి సంచరిస్తోందన్న భయంతో ఆగర్‌గూడ పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.