గురువారం 28 మే 2020
Telangana - May 02, 2020 , 19:06:17

ఆసిఫాబాద్‌ పట్టణ శివారులో పులి సంచారం

ఆసిఫాబాద్‌ పట్టణ శివారులో పులి సంచారం

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రం సమీపంలోని చిర్రకుంట పరిసర ప్రాంతాల్లో పులి సంచరించింది. గత రెండు రోజుల క్రితం తుంపల్లి గ్రామ సమీపంలో ఒక ఆవుపై దాడి చేసి చంపేసింది. ఇక్కడి పరిసరాల్లో తిరుగుతున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎండా కాలం కావడంతో, లాక్‌డౌన్‌ వల్ల జనసంచారం లేక అటవీ జంతువులు గ్రామాల సమీపంలోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం పట్టణ సమీపంలో రోడ్డు దాటుతున్న పులిని కొందరు ఫోటోలు తీయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని పట్టుకుని దట్టమైన అడవి ఉన్నచోట వదిలిపెడతామని అధికారులు వివరించారు. 


logo