బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 18:50:01

భద్రాద్రి జిల్లాలో పెద్దపులి అలజడి

భద్రాద్రి జిల్లాలో పెద్దపులి అలజడి

భద్రాద్రి కొత్తగూడెం :  జిల్లాలోని కరకగూడెం, గుండాల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి అలజడి గమనించినట్లు రంగాపురం పరిధిలోని వీరాపురం గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు, వైల్డ్‌లైఫ్‌ సిబ్బంది అడవిలో పెద్దపులి జాడ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలోని పద్మాపురం అటవీప్రాంతం పరిధిలో నీలాద్రిపేట గండి వలస ఆదివాసీలతో అటవీ అధికారులు మాట్లాడి జంతువులకు సంబంధించిన ఉచ్చులు అడవిలో ఏర్పాటు చేయవద్దన్నారు. పెద్దపులి సంచారం చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.