గురువారం 28 మే 2020
Telangana - May 08, 2020 , 01:14:21

ఖైరిగూడలో పులి సంచారం

ఖైరిగూడలో పులి సంచారం

తిర్యాణి : కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్‌ సమీపంలో పులి సంచారం స్థానికంగా ఆందోళనరేపుతున్నది. డీబీఎల్‌ క్యాంపు స మీపంలోని వాగులో గురువారం ఉదయం కొంతమంది సింగరేణి కార్మికులు పులిని చూసి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారమందించడంతో వారు అక్కడికి చేరుకొని దాని అడుగులను గుర్తించే పనిలోపడ్డారు.logo