శనివారం 11 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 09:25:23

మంచిర్యాల జిల్లాలో పులి కదలికలు.. భయాందోళనలో ప్రజలు

మంచిర్యాల జిల్లాలో పులి కదలికలు.. భయాందోళనలో ప్రజలు

మంచిర్యాల : కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ సమీపంలో పులి కదలికలు కనిపించాయి. పారుపల్లి - రాజారం కొత్తపల్లి గ్రామానికి వెళ్లే దారిలో పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి కదలికలపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జైపూర్‌, భీమారం, చెన్నూరు మండలాల మీదుగా కోటపల్లి మండలంలోకి పులి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 


logo