ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 21:23:29

సింగరేణి గని వద్ద పెద్దపులి కలకలం...

సింగరేణి గని వద్ద పెద్దపులి కలకలం...

మంచిర్యాల‌ :  శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్‌కే 8గనిపై ఈ రోజు పెద్దపులి సంచరించింది. గని మెయిన్‌ గేట్‌, మ్యాగ్జిన్‌ వద్ద సింగరేణి ఎస్‌అండ్‌పీసీ కే సతీశ్‌కుమార్‌, జీ సత్యనారాయణ విధులు నిర్వహిస్తుండగా ఆర్‌కే 8గని సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి మెయిన్‌ గేట్‌ సమీప మ్యాగ్జిన్‌ వద్ద గల నీటి మడుగులో నీరు తాగడానికి వచ్చింది. దీనిని చూసి ఒక్కసారిగా భయంతో పరుగులుతీశారు. డిప్యూటీ ఎఫ్‌ఆర్వోలు సంతోశ్‌కుమార్‌, సాగరిక, సునీత అటవీ సిబ్బంది అక్కడి చేరుకొని పులి అడుగులను గుర్తించారు. అనంతరం ఎనిమల్‌ ఫారెస్ట్‌ ట్రాకర్‌ ఎల్లం ఆధ్వర్యంలో ఆర్‌కే 8గని ఆవరణలో, అటవీ ప్రాంతంలో  పులి సంచరించినట్లు రికార్డు చేశారు. పెద్దపులు అడుగులను ఫొటో తీశారు.logo