బుధవారం 03 జూన్ 2020
Telangana - May 20, 2020 , 22:11:32

ఓపెన్‌ కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచారం

ఓపెన్‌ కాస్టు ప్రాంతంలో పెద్దపులి సంచారం

తిర్యాణి : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం కైరిగూడ ఓపెన్‌కాస్టు అటవీప్రాంతంలో గత 15 రోజులుగా పెద్దపులి సంచరిస్తున్నది. నిత్యం విధులకు వెళ్లే కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వారం క్రితం కైరిగూడ ఓపెన్‌కాస్టు సమీపంలో తచ్చాడుతున్న పులి కార్మికులకు కంటపడగా అటవీ అధికారులకు సమాచారమందించారు.  సాయంత్రం మరోసారి ఓపెన్‌కాస్టు సమీపంలోకి రావడంతో కార్మికులు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.logo