శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 10:08:09

జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో పెద్దపులి

జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో పెద్దపులి

హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గత పది రోజులుగా జిల్లాలో రోజుకొక చోట పెద్దపులి కన్పిస్తున్నది. తాజాగా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పరిసరాల్లో పెద్దపులి సంచరించింది. పవర్‌ ప్లాంట్‌ పరిసరాల్లో పులి తిరిగినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, పరిసర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

గత ఆదివారం రాత్రి జిల్లాలోని ముదిగుంట గ్రామ శివారులో పెద్దపులి పాడిబర్రెపై దాడిచేసి చంపేసింది. వారం రోజుల క్రితం సింగరేణి కార్మికులకు శ్రీరాంపూర్‌ ప్రాంతంలో కనిపించింది.


logo