పెద్దపులి కలకలం

పెంచికల్పేట్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ సమీపంలోని పెద్దవాగులో గురువారం పెద్దపులి కనిపించింది. వాగు పరీవాహక ప్రాంతంలోని చేలల్లో పత్తి ఏరుతున్న కూలీలకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పెద్దవాగులో పులి నీరు తాగుతూ కనిపించింది. ఓ యువకుడు తన సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ప్రత్యేక సిబ్బందితో కలిసి పులి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. కేకలు, పెద్దగా శబ్దాలు చేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. గతంలో రేంజ్ పరిధిలో పలుమార్లు రోడ్లపై సంచరిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలున్నాయి. పలుమార్లు పశువులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో అటవీ ప్రాంతాల ప్రజలు మండల కేంద్రానికి వచ్చేందుకు జంకుతున్నారు. అగర్‌గూడ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో పులి సంచరించిన విషయం వాస్తవమేనని ఎఫ్ఆర్వో తెలిపారు.
తాజావార్తలు
- కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి
- మీకు డస్ట్ అలర్జీ ఉందా.. అయితే ఇవి తాగండి
- ‘మాస్టర్’ సినిమాపై నిహారిక రివ్యూ
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి : తెలంగాణ రైతు సంఘం
- సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు
- పురుషుల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గించండిలా..
- పోరాడిన కెప్టెన్ జో రూట్
- పీహెచ్‌సీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి హరీశ్‌రావు
- ప్రకృతి ఒడిలో రాశీఖన్నా కసరత్తులు..వీడియో వైరల్
- 2,752 కరోనా కేసులు.. 45 మరణాలు