గురువారం 09 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:30

ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలి

ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాలి

  • జయేశ్‌ రంజన్‌కు టీఐఎఫ్‌ వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్‌) విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ను కలుసుకున్న టీఐఎఫ్‌ అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి బృందం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఏడాదిపాటు ఆస్తి పన్ను, మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలను రద్దుచేయాలన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని జయశ్‌రంజన్‌ హామీ ఇచ్చారని సుధీర్‌రెడ్డి తెలిపారు. జయేశ్‌రంజన్‌ను కలిసిన వారిలో జీడిమెట్ల ఐలా చైర్మన్‌ సదాశివరెడ్డి, చర్లపల్లి ఐలా అసోసియేషన్‌ అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, మల్లాపూర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిషన్‌చంద్ర, గాంధీనగర్‌ ఐలా కార్యదర్శి స్వామిగౌడ్‌, పాశమైలారం అసోసియేషన్‌ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, టీఐఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గోపాల్‌రావు ఉన్నారు.


logo