బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 01:27:19

నాలుగురోజుల ముందే నైరుతి రాక

నాలుగురోజుల ముందే నైరుతి రాక

  • నాలుగురోజుల ముందుగానే రాక
  • తెలంగాణలో నేడు, రేపు వానలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులలోని కొన్ని ప్రాంతాలకు నైరు తి రుతుపవనాలు ఈ నెల 16వ తేదీనే చేరుకోనున్నాయి. ఈ నెల 20న రుతుపవనాలు అండమాన్‌ను తాకవచ్చని భారత వాతావరణశాఖ ముందుగా అంచనావేసింది. కానీ నాలుగురోజుల ముం దుగానే అండమాన్‌కు చేరుకోనున్నట్టు అధికారులు వివరించారు. మరోవైపు తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడువరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి కొనసాగుతున్నది. దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న సమత్రాతీర ప్రాంతాల్లో మధ్యస్త ట్రోపోస్పియర్‌ స్థాయిల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్ర భావం వల్ల ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న అండమాన్‌సముద్రం ప్రాంతాల్లో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత మరో 72 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఇది మరింత బలపడే అవకాశమున్నది. తెలంగాణలో మరో 48 గంటలవరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వివరించారు.


logo