శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 09, 2020 , 22:05:12

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పిడుగు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై పిడుగు

  • స్వల్పంగా దెబ్బతిన్న పెంట్‌హౌజ్‌ గోడ 

నల్లగొండ : దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై గురువారం పిడుగు పడింది. ఆ సమయంలో ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్ర కుమార్‌ కుటుంబీకులతో క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఈదురుగాలులకు కిటికీ అద్దాలు పగిలి ఉండొచ్చని భావించారు. బయటకు వచ్చి చూడగా పిడుగు పడిన ఆనవాళ్లు కన్పించాయి. పెంట్‌హౌజ్‌ అంచున పిడుగు పడడంతో గోడ స్వల్పంగా దెబ్బతిన్నది. క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న వెంచర్‌లో మరో పిడుగు పడినట్లు స్థానికులు తెలిపారు.

నియోజకవర్గంలో మోస్తరు వర్షం..

దేవరకొండ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. చందంపేట, కొండమల్లేపల్లిలో మోస్తరు వర్షం కురిసింది. చింతపల్లి మండలంలో భారీవర్షం పడగా అక్కడక్కడా వడగండ్లు పడ్డాయి.


logo