గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 01:35:30

నేడు గజ్వేల్‌కు కాళేశ్వరం నీళ్లు

నేడు గజ్వేల్‌కు కాళేశ్వరం నీళ్లు

  • తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌లో ట్రయల్న్‌క్రు సిద్ధం

గజ్వేల్‌/తొగుట: కాళేశ్వరం జలాలు కొండపోచమ్మ దిశగా మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌కు సోమవారం కాళేశ్వరం నీళ్లు చేరనున్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ వద్ద మల్లన్నసాగర్‌ సర్జ్‌పూల్‌లో మోటర్‌ ట్రయల్న్‌క్రు అంతా సిద్ధంచేశారు. రంగనాయక్‌సాగర్‌ నుంచి మల్లన్నసాగర్‌ సర్జ్‌పూల్‌లోకి నిర్ణీత సామర్థ్యం మేరకు నీళ్లు చేరుకోగానే గేట్లను మూసివేశారు. సర్జ్‌పూల్‌ నుంచి పంపులకు వెళ్లే డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లలోకి నీళ్లను వదులుతూ లీకేజీలను పరిశీలించారు. వారం రోజులపాటు సాంకేతికంగా అన్ని విషయాలు పరిశీలించి మోటర్లను పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. సోమవారం మోటర్ల ట్రయల్న్‌ నిర్వహించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా తొలిసారిగా సీఎం సొంత నియోజకవర్గానికి గోదావరి నీళ్లు చేరుతుండటంపై హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం అక్కారంలోని ఒకటో నంబర్‌ మోటర్‌ డ్రైరన్‌ నిర్వహించిన అధికారులు, రెండు, మూడు మోటర్లను కూడా అందుకు సిద్ధం చేశారు. తుక్కాపూర్‌ నుంచి కాళేశ్వరం జలాలు అక్కారం చేరుకున్న తర్వాత.. అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌ వద్ద మర్కూక్‌ సర్జ్‌పూల్‌కు ఎత్తిపోసే పనులు మొదలవుతాయి.


logo