ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 05, 2020 , 02:38:27

వదంతులకు మూడేండ్ల జైలు

వదంతులకు మూడేండ్ల జైలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో సోషల్‌మీడియాలో వదంతులు సృష్టించడం, సర్క్యులేట్‌ చేసేవారిపై సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు నిఘాపెట్టారు. ఇప్పటివరకు 20 మందికి నోటీసులు జారీచేశారు. సాంకేతికంగా పక్కా సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అలాంటివారికి ఒకరోజు నుంచి మూడేండ్ల వరకు జైలు శిక్షలు పడే అవకాశాలున్నాయని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. అలాంటివారిని గుర్తించేందుకు సైబర్‌ క్రైంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. నిత్యం ఒకటి రెండు సుమోటో కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. వాట్సాప్‌ గ్రూపుల్ల్లో సర్క్యులేట్‌ అయ్యే పోస్టులకు సంబంధించిన రివర్స్‌ మెథడ్‌లో సూత్రధారులను గుర్తించి పక్కాగా ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. గ్రూపుల్లో అసత్యవార్తలను సర్క్యులేట్‌చేస్తే గ్రూప్‌ అడ్మిన్లకే శిక్షలు పడుతాయని హెచ్చరించారు. ఫార్వర్డ్‌చేసే ముందు అందులో నిజమెంత అనే విషయాన్ని అడ్మిన్లు నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.


logo