మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 14:47:37

రాష్ట్రంలో మూడు వారాలపాటు దంత వైద్యసేవలు బంద్‌

రాష్ట్రంలో మూడు వారాలపాటు దంత వైద్యసేవలు బంద్‌

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మూడు వారాలపాటు అన్ని రకాల దంత పరీక్షలను నిలిపిస్తున్నట్లు తెలంగాణ స్టేట్‌ డెంటల్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర డెంటల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డా.కె.రాజేశ్‌ రెడ్డి తెలిపారు. దంత వైద్యులు కోవిడ్‌-19 భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా ఆయన పేర్కొన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను మూడు వారాల పాటు నిలిపివేయాలని రాజేశ్ రెడ్డి పేర్కొన్నారు.
logo
>>>>>>