సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 07:46:07

ఎల్బీనగర్‌లో మూడు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులు సీజ్‌

ఎల్బీనగర్‌లో మూడు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులు సీజ్‌

హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్‌లో రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచే రవాణాశాఖ అధికారుల బృందం ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్‌ బస్సులపై కొరడా ఝుళిపించారు. బస్సులకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు తనిఖీ చేశారు. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మూడు ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. ఆరు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్‌లపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌పై దాడులు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల కిందట శంషాబాద్‌, పెద్దఅంబర్‌పేట్‌ సమీపంలో రవాణాశాఖ అధికారులు దాడులు చేశారు. 12 ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదు చేశారు.


logo