మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 01:41:17

పెండ్లింట విషాదం

పెండ్లింట విషాదం
  • రోడ్డు ప్రమాదంలో వధువు సోదరుడు, మేనత్త, మరదలు దుర్మరణం
  • నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి వద్ద ఘటన

డిచ్‌పల్లి, నమస్తేతెలంగాణ: రెండు రోజుల్లో పెండ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొన్నది. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి కూతు రి సోదరుడితోపాటు మేనత్త, మరదలు దుర్మరణం చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లికి చెం దిన జయ్య సుమన్‌(19) శుక్రవారం ఉదయం బైక్‌పై సిరికొండ మండలం కొండాపూర్‌లోని మేనత్త నిమ్మజెట్టి రాజవ్వ(38) ఇంటికివెళ్లి తన సోదరి పెండ్లిపత్రికను అందజేశాడు. తిరుగు ప్రయాణంలో మేనత్త రాజవ్వ, ఆమె కూతురు అనూష(12)లను తన బైక్‌పై మెంట్రాజ్‌పల్లికి బయలుదేరాడు. డిచ్‌పల్లి సీఎంసీ వద్ద జాతీ య రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బైక్‌కు మరోబైక్‌ హ్యాండిల్‌ తగలడంతో సుమన్‌, రాజవ్వ, అనూష రోడ్డుపై పడిపోయారు. ఆ సమయంలో వెనుకనుంచి వేగంగా వస్తున్న లారీ అ నూష తలపై నుంచి, రాజవ్వ కాళ్లపై నుంచి వెళ్లి సుమన్‌ను ఢీకొట్టింది. దీంతో రాజవ్వ, సుమన్‌, అనూష అక్కడికక్కడే మృతిచెందారు. 


పెండ్లి వాయిదా..

కాగా సుమన్‌ సోదరి వివాహం ఆదివారం జరగాల్సి ఉన్నది. అంతలోనే రెండు కుటుంబాల్లో పుట్టెడు విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనతో వివాహం వాయిదా పడింది. డిచ్‌పల్లి ఎస్సై సురేశ్‌ కుమార్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.logo