ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 22:16:21

మెట్రోరైలుకు మూడు జాతీయ అవార్డులు

మెట్రోరైలుకు మూడు జాతీయ అవార్డులు

హైదరాబాద్: ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ప్రాజక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకుగాను మూడు జాతీయ అవార్డులు లభించాయి. బెంగుళూరులో ఇటీవల నిర్వహించిన పీఆర్‌సీఐ గ్లోబల్‌ కమ్యునికేషన్స్‌ సదస్సు సందర్భంగా ఎల్‌ అండీ మెట్రో కార్పొరేట్‌ కమ్యునికేషన్స్‌ హెడ్‌ అనిందితా సిన్హా  పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీఆర్‌సీఐ)కు చెందిన ఈ అవార్డులను అందుకున్నట్లు మెట్రోరైలు అధికారులు తెలిపారు. పీఆర్‌సీఐ అవార్డులు దక్కడం గర్వకారణమని ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు హైదరాబాద్‌ లిమిలెడ్‌(ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌) ఎండీ, సీఈఓ కెవిబి రెడ్డి తెలిపారు. అనతికాలంలోనే ప్రయాణికుల విశ్వాసం చూరగొని వారి సంఖ్య పెరిగేందుకు తమ కార్పొరేట్‌ కమ్యునికేషన్‌ విభాగం విశేషంగా కృషిచేసిందని, ఇందుకు గుర్తింపుగానే ఈ పురస్కారాలు లభించినట్లు ఆయన కొనియాడారు. 


logo