గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 17:47:45

మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్యర్థులు ఖ‌రారు

మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్యర్థులు ఖ‌రారు

హైద‌రాబాద్ : రాష్ర్ట శాసన‌మండ‌లిలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ ముగ్గురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. రేపు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

గోరటి వెంకన్న..

తండ్రి పేరు : గోరటి నర్సింహ్మా

తల్లి పేరు : గోరటి ఈరమ్మ

విద్య : ఎంఏ తెలుగు(ఓయూ డిస్టెన్స్‌)

రచనలు : ఏకునాధం మోతా, రేలపూతలు, అలసెంద్ర వంక, పూసిన పున్నమి, వెల్లంకి తాళం, ది వేవ్‌ ఆఫ్‌ ది క్రిసెంట్‌ పుస్తకాలను రచించారు. 

అవార్డులు : మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వంచే కబీర్‌ సమ్మాన్‌, రాష్ట్ర ప్రభుత్వంచే కాళోజి అవార్డు, ఉగాది పురస్కారం, సినారె అవార్డు, లోక్‌నాయక్‌ అవార్డు, అరుణ్‌ సాగర్‌ అవార్డు, అధికార భాషా సంఘం పురస్కారాలను అందుకున్నారు.  

బస్వరాజు సారయ్య..

రజక కులానికి చెందిన సారయ్య 5 డిసెంబర్‌,1955, వరంగల్‌లో జన్మించారు. 

విద్య : ఇంటర్‌మీడియట్‌, ఐటీఐ 

మాజీ మంత్రిగా పనిచేశారు

దక్షిణ భారతదేశంలోనే రజక కులం నుంచి ఎన్నికైన ఏకైక వ్యక్తి

1999, 2004, 2009లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు

వరంగల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌గా సైతం పనిచేశారు. 

బొగ్గారపు దయానంద్‌..

3 మే, 1954లో జన్మించారు. 

విద్య : బీఎస్సీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో డిప్యూటీ డైరెక్టర్‌(ప్రోటోకాల్‌)గా పనిచేశారు. 2003లో పదవీ విరమణ పొందారు

ప్రస్తుతం వ్యాపారంలో కొనసాగుతున్నారు

వాసవీ సేవా కేంద్రానికి లైఫ్‌ టైం చీఫ్‌ అడ్వైజర్‌

2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్నారు.