ముగ్గురు మిలీషియా సభ్యులు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : మావోయిస్టులకు సహకరిస్తున్న ముగ్గురు మిలీషియా సభ్యులను ఆదివారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చర్ల సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లబ మండల పరిధిలోని తాలిపేరు ప్రాజేక్టు సమీపంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. డ్యాం సమీపంలోని తిప్పాపురం వైపు ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు పిలిచారు. వెంటనే ముగ్గురూ పారిపోతుండగా పోలీసులు వెంబడించి విచారించారు.
పట్టుబడినవారు కిష్టారంపాడ్ గ్రామానికి చెందిన వెట్టి భీమరాజు అలియాస్ రాజేష్, బత్తినపల్లికి చెందిన సున్నం నాగేశ్వరరావు, బత్తినపల్లి గ్రామానికి చెందిన వెల్కం పెంటయ్యగా పోలీసులు గుర్తించారు. విచారణలో వీరికి గతంలో సత్యనారాయణపురం రహదారి పేల్చివేత, పగిడివాగు బ్రిడ్జి పేల్చివేత, కలివేరు సమీపంలో మావోయిస్టుల బ్యానర్లు వేసిన ఘటనల్లో ప్రమేయం ఉందని తేల్చారు.
మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు పీఎల్జీఏలో భాగంగా విధ్వంసం సృష్టించేందుకు తాలిపేరు డాం సమీపంలో గుంటలు తీస్తున్నారని, ఇనుప చువ్వలు అమర్చిన ఆరు చెక్కలు అమర్చడం కోసం వచ్చినట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి కరపత్రాలను స్వాధీనం చేసుకున్నామని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
- వీఐపీలా ఫోజిచ్చి రూ 1.43 లక్షలకు టోకరా
- స్టాలిన్ అసమర్థ నాయకుడు: పళనిస్వామి
- జమ్ముకశ్మీర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్పై నిషేధం పొడిగింపు
- టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వచ్చేసింది!
- వివాదాస్పద భూములను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
- బ్రెజిల్‌కు టీకాలు.. భారత్‌ను మెచ్చుకున్న డబ్ల్యూహెచ్‌వో
- ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం
- నేతాజీ జీవితం నుంచి యువత స్ఫూర్తి పొందాలి : వెంకయ్యనాయుడు
- ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి రెండేళ్ల జైలు
- ‘గిరిజన మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి’