గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 18:39:59

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

హైదరాబాద్ : మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మియాపూర్‌లోని  హఫిజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్న దీపిక (34) తన కూతురు సాయిలిపి (14), కుమారుడు చైతన్య(9)తో కలిసి శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు రెండురోజులుగా బంధువులు, తెలిసిన వారి ఇండ్లలోఆరా తీసినా ఆచూకీ ఎక్కడా లభించలేదు. దీంతో మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు ఎటు వెళ్లారో తెలుసుకునేందుకు స్థానికంగా సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.