శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:08

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని నాకాతండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. కేరళలోని కాలికట్‌కు చెందిన అనీష్‌థామస్‌ కుటుంబం కొన్నేళ్లుగా  బీహార్‌ రాష్ట్రంలో పాఠశాలను నడుపుతున్నది. లాక్‌డౌన్‌ కారణంగా బీహార్‌లోనే ఉన్న అనీష్‌థామస్‌ తన భార్య దివ్య, కూతుర్లు అనాలియా(ఏడాది), అజాలియా, పాఠశాల ఉపాధ్యాయుడు స్టెనిజోసీతో కలిసి శుక్రవారం కారులో కేరళకు బయల్దేరారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో వీరి కారు నాకాతండా వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్‌ దవాఖానకు తరలించగా అనీష్‌థామస్‌(33), స్టెనిజోసీ(24), అనాలియా(ఏడాది) మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన దివ్య, అజాలియాలను హైదరాబాద్‌కు తరలించారు.


logo