శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 12:28:42

అడవి పందుల దాడిలో ముగ్గురికి గాయాలు

అడవి పందుల దాడిలో ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి.. అడవి పందుల దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బహదూర్‌ అలీ మక్తాలో చోటుచేసుకుంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కాంపౌండ్‌ నుంచి మక్తా వైపు గుంపుగా వెళ్తున్న అడవిపందులు ఓ ఇంట్లోని వ్యక్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులను ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.


logo