గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 27, 2020 , 21:24:36

మానేరు వాగులో చిక్కుకున్న ముగ్గురు మ‌త్స్య‌కారులు

మానేరు వాగులో చిక్కుకున్న ముగ్గురు మ‌త్స్య‌కారులు

కరీంనగర్ : వీణవంక మండలంలోని చల్లుర్ గ్రామ శివారులో గ‌ల‌ మానేరు వాగులో ముగ్గురు వ్యక్తులు చేపలు పడుతుండగా వరద దాటికి కొట్టుకుపోయారు. అయితే చెట్టును పట్టుకొని సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం కలెక్టర్ శశాంక దృష్టికి తీసుకెళ్ల‌డంతో లోయ‌ర్ మానేరు డ్యాం గేట్ల నుంచి నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి వేశారు. కరీంనగర్ నుంచి రెస్క్యూ టీం సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుంది. ముగ్గురిని రక్షించే ప్రయత్నాలు కొన‌సాగుతున్నాయి.