ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 22:13:45

రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్ష సూచన

హైదరాబాద్ : ఉత్తర కోస్తా ఒరిస్సా, దాని పరసర ప్రాంతాల్లో 0.9కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో పాటు తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా తూర్పు విధర్బ వరకు 0.9కి.మీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రేటర్‌లో రెండవ సారి గరిష్ట ఉష్ణోగ్రతలు 35డిగ్రీలు దాటాయి. ఈనెల 13న నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 35.9డిగ్రీల సెల్సియస్‌  నమోదవగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30గంటల వరకు 35.5డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 22.5డిగ్రీల సెల్సియస్‌, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. logo