మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 21:04:57

యాదాద్రిలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

యాదాద్రిలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం

యాదాద్రి భువ‌న‌గిరి : యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ప్రారంభం అయ్యాయి. బుధ‌వారం సాయంత్రం ప్రారంభ‌మైన ఈ ప‌విత్రోత్స‌వాలు మూడు రోజుల‌పాటు కొన‌సాగ‌నున్నాయి. పవిత్రోత్సవంను ఆలయ పూజారులు స్వస్తి వచనాల‌తో బాలాలయంలో ప్రారంభించారు. పవిత్రోత్సవంలో భాగంగా జులై 30, 31 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎన్‌. గీత మాట్లాడుతూ... ప‌విత్రోత్స‌వం అంటే తెలిసి గానీ, తెలియ‌క గానీ స్వామికి చేసే సేవ క‌ర్మ‌ల్లో త‌ప్పిదాలు దొర్లిన‌ట్లైతే పూజారులు మ‌న్నింపు కోరుతూ శ్రీ లక్ష్మీన‌ర‌సింహ‌స్వామికి చేసే ఆరాధ‌నే ఈ ప‌విత్రోవ్స‌వం అన్నారు. 

కోవిడ్ -19 మహమ్మారి నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులను పవిత్రోత్సవానికి హాజరుకావద్దని ఆమె కోరారు. ఆలయ సిబ్బంది, పూజారులు పవిత్రోత్సవంను నిర్వ‌హిస్తార‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ సేవల‌ను ఈ నెల 30, 31 తేదీలలో ర‌ద్దు చేస్తున్న‌ట్లు తిరిగి ఆగ‌స్టు 1వ తేదీన ప్రారంభమవుతాయ‌ని తెలిపారు. 


logo