బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Feb 20, 2020 , 00:26:53

ముగ్గురు దోపిడీ దొంగల పట్టివేత

ముగ్గురు దోపిడీ దొంగల పట్టివేత

న్యాల్‌కల్‌: తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దారిదోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు అనుమానితులను సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం వడ్డి, శంశోల్లాపూర్‌ గ్రా మస్థులు మంగళవారం రాత్రి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన కొందరు దుండగులు బీదర్‌ - జహీరాబాద్‌ దారిలో వెళ్లేవారిని అడ్డగించి డబ్బు, నగలు దోచుకుంటున్నారు. దీంతో వడ్డి, శంశోల్లాపూర్‌ గ్రామానికి చెందిన కొందరు రహదారి పక్కన కాపుకాచి ముగ్గురు అనుమానితులను పట్టుకున్నారు. అనంతరం పో లీసులకు సమాచారమందించగా వారు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.


logo