శనివారం 30 మే 2020
Telangana - May 15, 2020 , 15:51:34

బీజేపీని వీడిన ముగ్గురు కార్పొరేటర్లు

బీజేపీని వీడిన ముగ్గురు కార్పొరేటర్లు

నిజామాబాద్ : సీఎం  కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనను చూసి పలువురు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా  నిజామాబాద్ అర్బన్ కి చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు 8వ డివిజన్ విక్రమ్, గౌడ్ 9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గణేష్ బిగాల  ఆధ్వర్యంలో  టీఆర్ఎస్ లో చేరారు. వారికి  గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కాగా, ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలో చేరడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 


logo